బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. మదనపల్లెటౌన్ బసినకొండ జన్మభూమి కాలనీ కేదారేశ్వరీ దేవాలయంలో నివాసం ఉంటున్న మాండలిక వెంకటశాస్త్రి తన సమస్యను చెప్పుకోవడానికి నడవలేని స్థితిలో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ తన ఛాంబర్ నుంచి శాస్త్రి వద్దకు వెళ్లి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.చట్టపరిధిలో వారికి న్యాయం చేయాలని మదనపల్లె డీఎస్పీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment