రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ బి. నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యా రు. సోమవారం పట్ట ణ అభివృద్ధి శాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయానికే పరిమితి కావడం, ఇతర కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు.
భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి మూలవిర్‌ట్‌లకు స్వామివారికి అర్చకులు పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు.పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధులు, ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి పాల్గొన్నారు.
రైతులు గుర్తింపు కార్డులు తీసుకోవాలి
గుర్రంకొండ : రైతులందరూ తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డులను తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ అన్నారు. సోమవారం స్థానిక రైతుసేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతు గుర్తింపు కార్డుల కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 6725 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 2513 మంది గుర్తింపు కార్డుల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈకార్యక్రమాన్ని ఇంకా వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుసేవాకేంద్రాల్లో రైతులు తమ భూమి రికార్డులు, వన్‌బీ, అధార్‌కార్డు జిరాక్స్‌కాపీలతో పాటు తమ సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో గుర్తింపు కార్డులు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకొన్న వారికి త్వరలో గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎవో రత్నమ్మ, ఎఈవో ఆనిత, వీహెచ్‌ఎ నవాజ్, రైతులు పాల్గొన్నారు.
టెంకాయల వేలం పాట
రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కామాక్షి త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో సంవత్సరం పాటు టెంకాయలు విక్రయించేందుకు వేలంపాట నిర్వహించినట్లు దేవస్థాన ఈఓ గంగవరం కొండారెడ్డి తెలిపారు. సోమవారం ఆలయంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జనార్దన సమక్షంలో వేలం పాట జరిగిందన్నారు. పూల దత్తాత్రేయ రూ.7,10,000 వేలం దక్కించుకున్నట్లు ఈఓ తెలిపారు.
నేడు, రేపు కడపలో
అంతర్జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళ,బుధవారాల్లో ‘తెలుగులో రామాయణాలు – సామాజిక దృక్పథం’అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీ కె. కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు. సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు 60 మంది పరిశోధనా పత్రాలు సమర్పణ చేస్తారన్నారని తెలిపారు. విదేశాల ప్రతినిధులు, పత్ర సమర్పకులు అంతర్జాలం ద్వారా కూడా పాల్గొంటారన్నారు. మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్‌కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారన్నారని ఆమె వివరించారు.
రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment