ప్రభుత్వ తీరు.. టీచర్ల బెంబేలు
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ అధోగతి పాలవుతోందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్తగా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటైన తర్వాత సమావేశాల నిర్వహణకు మూడో శనివారం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక వేళ ఆ రోజు సెలవు దినమైతే నాల్గో శనివారం నిర్వహిస్తారు.
భిన్నమంటూనే చిక్కుల్లోకి నెట్టి..
సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అటు విద్యార్థుఽలు, ఇటు టీచర్లకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశంలోనూ గతానికి భిన్నమంటూ అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. గతంలో రెండు రోజులు కాంప్లెక్స్ సమావేశాలు జరిగేవి. తొలి రోజు 50 శాతం మంది, తర్వాత రోజు 50 శాతం మంది టీచర్లు హాజరయ్యే వారు. దీంతో ఇబ్బందులుండేవి కాదు. జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 125 క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌లుగా మార్పు చేశారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌లో 10 నుంచి 20 స్కూళ్లు ఉంటాయి. ఈనెల 15న తొలి క్లస్టర్ స్కూల్ సమావేశాలు జరగనున్నాయి.
ఉదయం బడి, మధ్యాహ్నం మీటింగ్..
ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూళ్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌కు వెళ్లాలంటే పలువురి ఉపాధ్యాయులకు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.
నేడు జిల్లాలో 125 క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
ఒక పూట బడి, ఇంకో పూట మీటింగులు
కూటమి సర్కారు వింత నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
రెండు చేయాలంటే కష్టం
ఉదయం బడికి వెళ్లి తర్వాత మీటింగ్‌కు వెళ్లాలంటే ఉపాఽ ద్యాయులకు కష్టం. మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూళ్లల్లో ఉండి తర్వాత 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లస్టర్ స్కూల్‌కు ఎలా చేరుకుంటారో ప్రభుత్వానికే తెలియాలి.సమావేశాలు సౌకర్యవంతంగా ఉండేలా నిర్వహించాలి. –మధుసూదన్,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యార్థులకు ఇబ్బందులు
ఉదయం పాఠశాల పెట్టుకుని భోజనం పెట్టిన తరువాత పాఠశాల వదలిపెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారు. వారు ఇళ్లు చేరుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సమయానికి బస్సులు, ఇతర సౌకర్యాలు ఉండవు. –రెడ్డప్పరెడ్డి,
వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వ తీరు.. టీచర్ల బెంబేలు
ప్రభుత్వ తీరు.. టీచర్ల బెంబేలు
ప్రభుత్వ తీరు.. టీచర్ల బెంబేలు
Comments
Please login to add a commentAdd a comment