రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలో నిర్వహించే ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి శనివారం రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు డీఆర్‌ఓ, ఏఓ, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ పరిసరాల్లో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టరేట్ పరిసరాలలో ఉన్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరివేసి శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నెలకొకటి చొప్పున 12 మాసాలకు 12 అంశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మాసంలో ‘‘వనరు–మూల వనరు’’అంశంతో స్వచ్ఛ కార్యక్రమాలను పాటిస్తున్నామన్నారు. అనంతరం పాల్గొన్న వారందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment