దాతృత్వం అభినందనీయం
రాయచోటి: ఇంటి గృహాలపై ‘సూర్య ఘర్’ పథకం కింద విద్యుత్ సౌకర్యం కల్పించడానికి సామాజిక బాధ్యత కింద సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్ల ఏర్పాటు నిమిత్తం అర్చన విద్యాసంస్థల యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని చాంబర్లో రాయచోటి అర్చన విద్యాసంస్థల కరెస్పాండెంట్ పి.మదన్‌మోహన్‌రెడ్డి రూ.5.7 లక్షల విలువ గల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. . ఆయనను స్పర్తిగా తీసుకొని మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల ప్రతినిధి భరత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment