రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
రాజంపేట రూరల్: రైతులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య(విశిష్టగుర్తింపు సంఖ్య)ను ఇచ్చే ప్రక్రియకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్‌కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతి రైతుకు 11 అంకెలు కలిగిన యూనిక్ ఐడీ నెంబర్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇవ్వనుంది. ఇందులో భాగంగా రైతులకు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సహాయకుల ద్వారా ఫార్మర్స్ రిజిస్ట్రీ(ఎఫ్‌ఆర్) పోర్టల్లో రైతుగా నమోదు ప్రక్రియ ప్రారంభించింది.వ్యవసాయశాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌కు ఈ నమోదు బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో మొత్తం 3,52,873 మంది రైతులు ఉండగా వీరిలో పీఎం కిసాన్‌కు సంబంధించి 1,83,659 మంది ఉన్నారు. వీరిలో 15వ తేదీకల్లా 30 శాతం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైతులకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పథకాలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం.
నమోదుకు అవసరమైన
ధ్రువ పత్రాలు: రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, వన్‌బీ, ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్తారు. రైతు మొబైల్ ఫోన్‌కు మూడు ఓటీపీలు వస్తాయి, ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియచేస్తే రైతు యూనిక్ ఐడీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
రైతుకు ఒనగూరే ప్రయోజనాలు
ఆధార్ మాదిరిగా యూనిక్ కోడ్‌తో జారీ చేసే ఈ కార్డులతో రైతులకు ఐడీ కార్డుగా ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలను రైతుల యూనిక్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ యూనిక్ నంబర్ ఉన్న రైతులకు వ్యవసాయ పథకాలు, ఎరువులు, పంటల బీమా అందుతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఈ యూనిక్ నబబర్‌ను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింక్‌తో కూడిన సేవలు పొందవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. వీటితోపాటు ఇతర సేవలైన నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటీ సేవలు కూడా పొందేందుకు వీలవుతుంది.
ప్రత్యేక యాప్‌ద్వారా నమోదు
పథకాలకు ఇదే ఆధారం
నమోదు చేసుకోవాలి
రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకో వాలి. లేకుంటే ప్రభు త్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారు. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో లేకుంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు పేరు నమోదు కాదు. రైతులు ఆన్‌లైన్ చేయించుకుని ఎఫ్‌ఆర్‌లో నమోదు కావాలి. –జీ.రమేష్‌బాబు, డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకులు, రాజంపేట
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment