బీసీల సంక్షేమానికి పెద్దపీట
రాయచోటి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖమంత్రి మండిపల్లె రాంప్రసా ద్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అజయ్ కన్వెన్షన్ హాల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతిగా పనిచేస్తూ బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలకు పార్టీతో పాటు ప్రజాప్రాతినిధ్య పదవులలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగల్‌రావు, కన్వీనర్ ఆవుల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి, జిల్లా అధ్యక్షురాలు పద్మయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment