ఖాజీపేట : కంచే చేను మేసిందన్న సామెత చందాన దొంగ సొత్తుకు కాపలా కాయాల్సిన రక్షక భటుడే దాన్ని చోరీ చేశాడు. చివరకు ఉన్నతాధికారులు గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో కాపర్ వైర్ చోరీ చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట మండలంలో 2024లో రెండు ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ వైర్‌ను దొంగలు చోరీ చేశారు. ఈ సంఘటనపై ఖాజీపేట స్టేషన్‌లో రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాజీపేట సీఐ మోహన్ దొంగలను పట్టుకుని వారి నుంచి కాపర్ వైర్ రికవరీ చేశారు. 14 కేజీల కాపర్ వైర్‌ను పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉంచారు. లాకప్‌లోని కాపర్ వైర్‌ను తిరిగి కేసులో చూపించాలని ప్రయత్నించిన పోలీసులకు కాపర్ వైర్ కనిపించలేదు. ఈ విషయమై విచారణ జరిపిన సీఐ సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఈ పరిశీలనలో కానిస్టేబుల్ చిన్నయ్య చోరీ చేసినట్లు గుర్తించారు. అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సీఐ నివేదిక పంపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ అంతర్గత విచారణ జరిపి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment