సోలార్ బాధితులకు న్యాయం చేస్తాం
గాలివీడు : సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని తూముకుంట గ్రామంలో అదనంగా ఏర్పాటు చేస్తున్న 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులను ఆయన తహసీల్దార్ భాగ్యలతతో కలసి పరిశీలించి, రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ అదనపు ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణం పనులు జరుగుతుండగా కొందరు స్థానికులు పదే పదే అడ్డు తగలడం సరికాదన్నారు. ఆ భూములు వారి అనుభవంలో ఉన్నట్లు ఆధారాలు ఉంటే వారితో చర్చించి వారికి ప్రత్యామ్నాయంగా అసైన్‌మెంట్‌లో భూమిని కేటాయిస్తామన్నారు. ఇదిలా ఉండగా తూముకుంట దిగువమూల, ప్రకాశ్ నగర్ కాలనీ వాసులు తమ అనుభవంలో ఉన్న భూములను సోలార్‌కు కేటాయించడం ద్వారా 40 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలో ఉన్న రేకులషెడ్లపై
చర్యలు తీసుకోండి
గుర్రాలమిట్ట వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు తొలగింపునకు తగిన చర్యలు తీసుకో వాలని ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ బాలాజీ, ఎస్‌ఐ రామకృష్ణ, వీఆర్‌ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment