బాబు, పవన్ కల్యాణ్ దోపిడీదారులకు కాపలాదారులు
రైల్వేకోడూరు అర్బన్ : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారని, అలాగే దోపిడీదారులకు కాపలాదారులుగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఆదివారం రైల్వేకోడూరులో జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంటే ప్రజల్లో ఆగ్రహం వస్తుందని గమనించి డైవర్షన్ పాలిటిక్స్ కోసం దేవుళ్లను వాడుకొన్నారని విమర్శించారు. పేద, బడుగు, బలహీన, కార్మిక, వర్గాలకు అన్యాయం చేస్తూ పెట్టుబడి, దోపిడీదారులకు కాపలాదారుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాధాక్రిష్ణ, సాంబశివ, నాయకులు గంగాధర్, రాజశేఖర్, పండుగోలు మణి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment