దేవదాయశాఖ అధికారులను అడ్డుకున్న పద్మశాలీలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో 32 సంవత్సరాల క్రితం గ్రామస్తులు భద్రావతి భావనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయం ఇప్పుడు దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డు నాటే ప్రయత్నం చేసిన ఎండోమెంట్ అధికారులను ఆదివారం గ్రామంలోని పద్మశాలీలు అడ్డుకున్నారు. దీనిపై ఆలయ ధర్మకర్త కేసీఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పెద్దలకుగానీ, కమిటీ సభ్యులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవదాయశాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండారెడ్డి, ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌లు ఉన్నట్లుండి ఆదివారం అనధికారికంగా వచ్చి ఆలయం దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డునాటే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని పద్మశాలీలు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్.వి.కృష్ణయ్య, పన్నెల చంద్రశేఖర్, బోగా శంకరయ్య, పోలిచెర్ల శ్రీనివాసులు, పద్మశాలీల ప్రెసిడెంటు బోడిగల అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ ఆలయం ఎప్పటి నుంచో దేవదాయ శాఖ ఆధీనంలో ఉందని దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కొండారెడ్డి తెలిపారు. బుధవారం వరకు గ్రామస్తులకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం ఆలయాన్ని దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment