మదనపల్లె : సైబర్ కేసులో నిందితుడైన మదనపల్లె వాసిని సోమవారం తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తరలించారు. వివరాలు... మదనపల్లె పట్టణం ఆర్‌ఆర్ వీధిలో ఉన్న షేక్ షా నవాజ్ (32) నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రైవేట్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది నిరుద్యోగుల వద్ద రూ. 11 లక్షల నగదు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా, కాలయాపన చేస్తూ వచ్చాడు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇచ్చేయాలంటూ బాధితులు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో బాధితులు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వకపోవడంతో, ఉద్యోగాలు ఇప్పించకుండా తమ నగదు కాజేసి మోసం చేశాడని గ్రహించిన బాధితులు హైదరాబాద్ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణలో భాగంగా నిందితుడి ఆచూకీ తెలుసుకొని, సోమవారం మదనపల్లెకు వచ్చి వన్ టౌన్ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో నిందితుడిని హాజరు పరిచి, విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌కు తరలించిన తెలంగాణ పోలీసులు
ఉద్యోగాలు ఇప్పిస్తానని
రూ. 11 లక్షలు వసూలు
Comments
Please login to add a commentAdd a comment