అసత్య ఆరోపణలు మంత్రి స్థాయికి తగవు
రాయచోటి అర్బన్ : మున్సిపల్ పాలకవర్గంపై రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదని మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్‌బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహిమాన్, పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గం ఎలాంటి సహాయ, సహకారాలు అందించడం లేదని మంత్రి చెప్పడం దారుణమన్నారు. రాయచోటి అభివృద్ధికి మంత్రి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తమ వంతు పూర్తి స్థాయి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలో కౌన్సిల్ అనుమతి లేకుండానే తెలుగుదేశం పార్టీ నేతలు పలు పనులను చేపడుతున్నా కౌన్సిల్ సభ్యులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదన్నారు. గత మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 15వ ఫైనాన్స్ నిధుల వినియోగానికి సంబంధించి అధికారులు ఇష్టారాజ్యంగా తయారు చేసిన ప్రతిపాదనలను కౌన్సిలర్లు వ్యతిరేకించారనన్నారు. 15వ ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయిస్తుంటే రాష్ట ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల పనితీరు కారణంగానే మున్సిపల్ పాలకవర్గం, మంత్రికి మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. మంత్రి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకువచ్చినా అభివృద్ధికి తమ పాలకవర్గం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు ఈఽశ్వర్, సాదక్‌అలీ, కొలిమి చాన్‌బాషా, రౌనఖ్ హుస్సేన్, గౌస్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఫయాజ్ అహమ్మద్, అన్నా సలీం, రియాజ్, ఇర్ఫాన్, శ్యామ్‌కుమార్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం
Comments
Please login to add a commentAdd a comment