హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలు శిక్ష
రాయచోటి టౌన్ : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి ఈ.ప్రసూన తీర్పు వెలువరించినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. అర్బన్ ఎస్‌ఐ అబ్దుల్ జాహీర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె వీధిలో జబ్బార్ స్కూల్ దగ్గర నివాసం ఉండే షేక్ ఇలియాస్ అదే వీధిలో నివాసం ఉండే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో అదే వీధికి చెందిన మహబూబ్ జాన్‌తో గొడవ పడి అసభ్యకరంగా మాట్లాడాడు. ఇరుగుపొరుగువారు ఇచ్చి సర్దిచెప్పి పంపించారు. అయితే దీనిని అవమానంగా భావించిన షేక్ ఇలియాస్ 2022 సంవత్సరం జూన్ 1వ తేదీ రాత్రి 9–30 గంటల సమయంలో ఇంటి బయట ఒంటరిగా పడుకొని ఉన్న మహబూబ్ జాన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని పఠాన్ గులాబ్‌జాన్, హసీనా, మజహర్, అష్రిఫూన్‌లు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దీనిపై విచారణ సాగించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. జరిమానా విధించారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుళ్లు జి. రమేష్, నాగ శంకర్‌లు సాక్షులను ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment