విద్యార్థిని ఆత్మహత్య
– పాఠశాలకు వెళ్లి చదువుకోలేక...!
కడప అర్బన్ : పాఠశాలకు వెళ్లడం లేదని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప నగర శివారులోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కడప చిన్నచౌక్ పోలీసుల ప్రాథమిక విచారణ, మృతురాలి బంధువుల వివరాలిలా వున్నాయి. దేవకుమార్, ప్రభావతిల కుమారుడు మస్తానయ్య, సన్నీ కుమార్తె సుచిత్ర ఉన్నారు. మస్తానయ్య తన తండ్రితో పాటు బేల్దారిపనికి వెళుతున్నాడు. తల్లి ప్రభావతి ఇంటింటా పనులు చేసి జీవనం సాగించేది. సుచిత్ర మున్సిపల్ మెయిన్ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. సుచిత్ర తన అనారోగ్యం కారణాలతో నెలకు 15 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. హాజరు సరిగా లేక ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. దీంతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థిని సుచరిత తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు వెళ్లిపోయిన తరువాత ఇంటిలోపల గడియ వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుప్రక్కల వాళ్లు గమనించి తల్లిదండ్రులకు, పోసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆదేశా మేరకు ఎస్‌ఐ పి.రవికుమార్, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాథమికంగావిచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment