రాయచోటి: పిల్లల సంక్షేమమే ధ్యేయంగా మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి జిల్లాలో బాల్య వివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య కార్యక్రమంపై జిల్లాస్థాయి బాలల సంక్షేమం, పరిరక్షణ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిషన్ వాత్సల్యను కట్టుదిట్టంగా అమలు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంలో అనాథ పిల్లలు, ప్రత్యేక రక్షణ కావాల్సిన పిల్లలు, నేరాల బారిన పడిన పిల్లలు తదితరులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి రమాదేవి, రాజంపేట అడిషనల్ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, మదనపల్లి, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు, జీఎస్‌డబ్ల్యుఎస్, విద్య, వైద్య, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment