ఒంటిమిట్ట క్షేత్రం రెండో అయోధ్యను తలపిస్తోంది
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం రెండో అయోధ్యను తలపిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ (ఐఏఎస్) ప్రశంసించారు. బుధవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒంటిమిట్ట చెరువులో నీటి వసతి కల్పిస్తే ట్యాంక్‌బండ్ తరహాలో బోటింగ్ నిర్వహించవచ్చన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆలయ చరిత్ర అన్ని భాషల్లో తెలిసే విధంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆలయం అయోధ్య, వారణాసి తరహాలో పర్యాటకులకు ఆకర్షిస్తుందన్నారు. అలాగే ఇక్కడ ఉన్న హరిత రెస్టారెంట్‌ను పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళిక, మార్పులు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట రామయ్య క్షేత్ర గోపురాలు మూసిపోయి ఉండడం గమనించి పురావస్తు శాఖ అధికారులు కెమికల్‌తో గోపురాలను శుద్ధిచేస్తే బాగుంటుందన్నారు. ఈయన వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్ కుమార్, కడప ఆర్డీఓ జాన్ ఇరివిన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఈశ్వరయ్య, డివిజనల్ మేనేజర్ మల్లికార్జున, ఒంటిమిట్ట తహసీల్దార్ వెంకటరమణమ్మ, ఆలయ టీటీడీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అంజనా గౌరీ ఉన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
Comments
Please login to add a commentAdd a comment