రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి బ్రహ్మోత్సవాలు నెల 23వ నుంచి మార్చి 5 వరకు జరనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గురువారం ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో రమణారెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రాయచోటి సబ్ జైల్ తనిఖీ
రాయచోటి టౌన్: రాయచోటి సబ్ జైల్‌ను రాష్ట్ర సేవాధికార సంస్థ ఉమ్మడి కడప జిల్లా సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100 తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనులపై విచారణ
గుర్రంకొండ: మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీలొ జరిగిన ఉపాధిహామీ పనుల అవకతవకలపై మండల అధికారులు విచారణ జరిపారు. గ్రామంలో జరిగిన పనుల్లో ఉద్యోగుల పేర్లు, పనిచేయని వారి పేర్లతో బిల్లులు చేసుకున్నారని గ్రామస్తులు ఇటివల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంపీడీవో వెంకటేశులు, ఎపీవో జయరామిరెడ్డిలు గరువారం విచారణ నిర్వహించారు. విచారణ శుక్రవారానికి ఫూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.
మదనపల్లెలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం?
మదనపల్లె: పట్టణంలోని చంద్ర కాలనీలో పెద్ద మొత్తంలో (80 కిలోలకు) పైగా గంజాయిని గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం మధ్యాహ్నం పోలీసులు తమకు గంజాయి కేసులో దొరికిన నిందితుడిని విచారిస్తుండగా మదనపల్లె పట్టణం చంద్ర కాలనీలో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో సుమారు 80 కిలోల పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది...తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.... పట్టుబడిన గంజాయి, ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. తర్వాత నిందితులను, గంజాయిని డీఎస్పీ కార్యాలయానికి తరలించి, ఎక్కడ నుంచి రవాణా జరిగింది ఇందులో కీలక సూత్రధారులు ఎవరు, ఎన్నాళ్లుగా జరుగుతుంది అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే మదనపల్లె డీఎస్పి కొండయ్య నాయుడును గంజాయి స్వాధీనం చేసుకున్న విషయమై వివరణ అడిగితే... తమకు గంగవరం పోలీసుల నుంచి సమాచారం వచ్చింది వాస్తవమేనని, స్థానిక పోలీసులతో బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సరుకు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం చేయలేదన్నారు. అయితే మదనపల్లె పట్టణంలో గంజాయి పెద్ద మొత్తంలో దొరకడం వెనక ఇంటెలిజెన్స్, ఎస్బి పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
బి.కొత్తకోట
ఎంపీపీపై అవిశ్వాసం
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ఆవిశ్వాస తీర్మానం కోరుతూ ఎంపీడీఓ మంగళం శంకరయ్యకు ఈనెల 10న నోటీసు అందజేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. 2020 మార్చిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలానికి చెందిన 11 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. తర్వాత కోవిడ్ ప్రభావంతో 2021 సెప్టెంబర్ 19న ఎంపీటీసీ సభ్యులుగా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నిక అనంతరం గుమ్మసముద్రం ఎంపీటీసీ లక్ష్మినరసమ్మను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో 11 మంది ఎంపీటీసీల్లో తొమ్మిది మంది ఆమైపె అవిశ్వాసం ప్రకటిస్తూ ఎంపీడీఓకు నోటీసు అందించారు. ఈ నోటీసులో సంతకాలు చేసిన ఎంపీటీసీల్లో వి.ఖాదర్‌వలీ (తుమ్మనంగుట్ట), ఎన్.రాధ (సూరపువారిపల్లి), వి.రామసుబ్బారెడ్డి (నాయనబావి), సి.ఎల్లప్ప (బీరంగి),ఎ.సుబ్బయ్య (బడికాయలపల్లి), ఎ.గౌతమి (మొటుకుపల్లి), బి.ఈశ్వరమ్మ (కోటావూరు), సి.విమలమ్మ (గోళ్లపల్లి), ఆకుల బాలకృష్ణ (గట్టు) ఉన్నారు. మిగతా రెండు ఎంపీటీసీల్లో ఒకరు ఎంపీపీ కాగా మరొకరు బయ్యప్పగారిపల్లి ఎంపీటీసీ ఎ.రమాదేవి ఉన్నారు. ఈ అవిశ్వాస నోటీసులో..ఎంపీటీసీలైన తమ పట్ల ఎంపీపీ నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తూ అభివృద్ధి ప్రతిపాదనలను ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. కాగా ఈ అవిశ్వాస నోటీసుపై గురువారం చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment