ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన వెంటనే నిర్వహించే మహా సంప్రోక్షణకు తిరుమల–తిరుపతి దేవస్థానం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రధాన గోపురాన్ని భక్తులు వీక్షించేందుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. కొన్ని నెలల తర్వాత గర్భాలయంలోని సీతారామ లక్ష్మణ మూర్తుల దర్శన భాగ్యం కల్పించనున్నందున ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు తెలిపారు. ఇందులోభాగంగా మార్చి 6 నుంచి 8 వతేదీ వరకు సాయంత్రం 5 గంటలకు అఖండ రామనామ భజన సంకీర్తనలు, శ్రీమద్రామాయణ సంగీత స్వరార్చన, రామాయణ ఉపన్యాసాలు జరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment