మదనపల్లె : పెట్రోల్ బంకు వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ, తారాస్థాయికి చేరి ఇరు వర్గాల మధ్య దాడికి దారితీసింది. గురువారం రాత్రి మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డు లోని పెట్రోల్ బంక్ వద్ద అరవ వాండ్ల పల్లెకు చెందిన గణేష్, కృష్ణాపురానికి చెందిన హరిల మధ్య వాహనాలకు పెట్రోల్ నింపుకునే విషయమై వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు గొడవపడ్డారు. హరి, గణేష్ పై దాడి చేసి కొట్టాడు. ఈ విషయాన్ని గణేష్ తన గ్రామంలోని వారికి తెలియజేశారు. దీంతో 50 మందికి పైగా అరవవాండ్లపల్లి నుంచి కృష్ణాపురం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన హరి తమ వర్గీయులకు సమాచారం అందించడంతో వారు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment