రూ.4.50 కోట్లకు ఐపీ బాంబ్
రాజంపేట రూరల్ : రాజంపేట పట్టణంలో అందరికీ సుపరిచితుడైన వ్యక్తి కోట్ల రూపాయలు దండుకొని మరో ఐపీ బాంబ్ పేల్చాడు. మెయిన్ బజార్‌లో కొన్ని సంవత్సరాలుగా షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్న ఈ అప్పుల అప్పారావు గురువారం కనిపించకుండా జంప్ కావడంతో అప్పులిచ్చిన వారు లబోదిబో మంటున్నారు. ఇతను చీటీల పేరుతో కొందరిని బురిడీ కొట్టించి నగదు తీసుకున్నాడు. అధిక వడ్డీలతో మరికొందరిని మభ్య పెట్టి అప్పుగా తీసుకున్నాడు. దాదాపు రూ.4.50 కోట్లకు పైగా అప్పులు చేసి చేతులెత్తేశాడు. పెద్దలకు తెలియకుండా అప్పులిచ్చిన వారు కొందరైతే, ఇంటిలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అప్పులిచ్చిన వారు సగం మంది ఉన్నారు. లక్షలలో అప్పులిచ్చిన వారు ఐటీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుకు రావటం లేదు. ఈ అప్పుల అప్పారావు వలన కొన్ని కుంటుంబాలు వీధిన పడేటట్టు ఉన్నాయి.
పొదుపుతోనే ఆర్థిక సాధికారత
రాయచోటి : ప్రతి ఒక్కరూ పొదుపును అలవాటు చేసుకొని సాధికారత సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్‌బీఐ ఆర్థిక పొదుపు వారోత్సవాలు–2025 ప్రచార పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఒక్కో అంశంతో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రజల్లో అవగాహన కలిగే విధంగా ఆర్థిక వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్ రావు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆంజనేయులు, సహాయ మేనేజర్ మన్నూరు బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment