రేపటి నుంచి అనంతపురం గంగమ్మ జాతర
లక్కిరెడ్డిపల్లె : అనంతపురం గంగమ్మ జాతర శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలెన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మిఠాయి బండ్లు, చెరకుల బండ్లు ఇక్కడికి చేరుకున్నాయి. గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, పూజారులు చెల్లు గంగరాజు, మదన్ మోహన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. లక్కిరెడ్డిపల్లె సీఐ వెంకటకొండారెడ్డి, ఎస్‌ఐ రవీంద్రబాబు బ్బందితో కలిసి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. అర్చకులు చెల్లు వంశీకులైన చెల్లు గంగరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment