అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలు
కలకడ : పవిత్ర ఝరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో కొందరు ఆకతాయిలు ఎండిన గడ్డికి నిప్పంటించారు. దీంతో దాదాపు ఐదు ఎకరాల మేర అడవిలోని చెట్లకు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న కలకడ సీఐ గురునాథ, ఎస్‌ఐ రామాంజనేయులు వెంటనే కలకడ మండలం కోన వద్దగల హెచ్‌పీసీఎల్ అధికారులకు సమాచారం అందించారు. హెచ్‌పీసీఎల్ అధికారి శ్రీనివాసరావ్ ఆదేశాలమేరకు అధికారులు సాయిమనీష్, మితిలేష్‌కుమార్, ఇస్మాయిల్, సిబ్బంది లక్ష్మీకాంత్, ఫకృద్దీన్, ఉపేంద్ర, ఫైరోజ్, సాయి తదితరులు మంటలు అదుపు చేశారు. మంటలు అన్నదాన సత్రంలోకి ప్రవేశించి ఉంటే పెనుప్రమాదం జరిగేది.
తప్పిపోయిన ముగ్గురు చిన్నారుల అప్పగింత
కడప, మదనపల్లె, కలకడ మండలంలోని చిన్నారులు ముగ్గురు పవిత్ర ఝరిలో తప్పి పోగా పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసులు మైకు ద్వారా ప్రచారం చేశారు. సాయంత్రం వరకు వేచి చూసి ఎట్టకేలకు వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment