నిత్యపూజ స్వామికి రూ.10 లక్షల ఆదాయం
సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామికి మహాశివరాత్రి ఉత్సవాల్లో రూ. 10 లక్షల 26 వేల 926 ఆదాయం వచ్చిందని నిత్యపూజ కోన మహా శివరాత్రి ఉత్సవాల ప్రత్యేక అధికారి సి.శివయ్య, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ జ్యోతి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ నిత్యపూజ కోన ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారన్నారు.
అలాగే వెండి ఒక కేజీ 324 గ్రాములు, బంగారం రెండు గ్రాముల 650 మిల్లి గ్రాములు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ పి.సురేష్ కుమార్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది సిద్దవటం, కడప పోలీసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment