
ప్రశాంత్‌నగర్‌లో చోరీ
మదనపల్లె : పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో చోరీ జరిగింది. బాధితులు వారం తర్వాత చోరీని గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎర్రిస్వామి బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మార్చి 31న భార్యతో కలిసి అరుణాచలం వెళ్లారు. దైవదర్శనం అనంతరం భార్య అనారోగ్యానికి గురికావడంతో అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొంది సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. తలుపులు తాళాలు పగలగొట్టి ఉండటం, వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో తనిఖీ చేసి 80 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి తీరని లోటు
రాయచోటి : విధులపట్ల ఎంతో నిబద్ధత కలిగిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమాను కోల్పోవడం జిల్లాకు తీరని లోటని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాల్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి అధికారిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆమె నిబద్ధత గురించి సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ చెప్పడంతోనే పీజీఆర్‌ఎస్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. ఈమె నియామకం తరువాత పిజిఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అన్నమయ్య జిల్లా ఎంతో వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన వ్యక్తి రమ అన్నారు. ఆమె ఎంతో మృదు స్వభావి, నిజాయితీగల అధికారిణి అని కొనియాడారు. సమావేశంలో డీఆర్‌ఓ మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సహదేవరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మండలంలోని వనిపెంట శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.శ్రీకాంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగు గంగ కాలనీకి చెందిన శ్రీకాంత్ మోటార్ బైక్‌పై మైదుకూరు వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్రగాయాలతో ఉన్న అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న యువకుడిని కారు ఢీకొన్నట్టు పలువురు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నిలపకుండా వెళ్లినట్టు చెబుతున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● వారం తర్వాత గుర్తించిన బాధితులు
● 80 గ్రాముల బంగారు అపహరించిన దొంగలు
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

ప్రశాంత్‌నగర్‌లో చోరీ