నీలమేఘశ్యామా.. | - | Sakshi
Sakshi News home page

నీలమేఘశ్యామా..

Published Wed, Apr 9 2025 12:27 AM | Last Updated on Wed, Apr 9 2025 12:27 AM

నీలమే

నీలమేఘశ్యామా..

కోదండ రామా..

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలలో నేడు: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. రాత్రి హనుమంత వాహన సేవ ఉంటుంది.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడారు. సీతారాముల కల్యాణానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన వివరించారు. కల్యాణం సందర్భంగా ఏప్రిల్‌ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందజేస్తామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు జర్మన్‌ షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశామని, 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్‌ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు హెచ్‌డీ క్వాలిటీతో ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారం అందిస్తుందన్నారు.

● కడప కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పులు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కల్యా ణ వేదిక ఆలయ పరిసరాలలో 250 మరుగు దొడ్లు నిర్వహిస్తున్నామన్నారు.

● కడప జిల్లా ఎస్పీ మాట్లాడుతూ టీటీడీ విజిలెన్సు విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్‌ యంత్రాంగం నుండి 2500 మంది భద్ర తా సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. 130 సిసి కెమెరాలు, 20 డ్రోన్లను ఏర్పా టు చేసి 4 ఫైర్‌ ఇంజన్లు, అత్యవసర సేవలందించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

● అంతకుముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా, టీటీడీ అధికారులు పరిశీలించారు.

సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈఓ

నీలమేఘశ్యామా.. 1
1/2

నీలమేఘశ్యామా..

నీలమేఘశ్యామా.. 2
2/2

నీలమేఘశ్యామా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement