
శ్రీరాముడిని రోల్‌మాడల్‌గా తీసుకోవాలి
రామయ్యను దర్శించుకున్న
కడప, రాజంపేట ఎంపీలు
ఒంటిమిట్ట : శ్రీరాముడిని రోల్‌మాడల్‌గా తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒంటిమిట్ట రామయ్యను ఎంపీలు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. వీరికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అలయ ప్రదక్షణ గావించి, గర్భాలయంలోని మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ రంగ మండపంలో వీరికి అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, ఘనంగా సత్కరించారు. అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.శ్రీరాముడు రాజుగా సుభిక్ష మైన పాలన అందిచాడని చెప్పారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు సంబటూరు రాంప్రసాద్‌రెడ్డి, సౌమ్యనాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ సౌమిత్రి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్‌రెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, పంచాయతీ రాజ్ మండల అధ్యక్షుడు మేరువ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు.