
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపాన పులివెందుల రోడ్డులో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు అరటి కాయలను లారీల లోడు నింపే కూలి పని చేసుకుంటూ పులివెందులలో నివాసముంటున్నాడు. వెంకట్రాముడు తన స్వగ్రామంలో జాతర ఉండటంతో శుక్రవారం కూలి పని తొందరగా ముగించుకొని తన స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా అంకాలమ్మ గూడూరు బలపనూరు గ్రామాల మధ్యలో ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్రాముడు(38) మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.