
బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ
ఓబులవారిపల్లె : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఫొటోలకు పోజులిస్తున్నారన్నారు. బీసీలకు, మైనార్టీల లబ్ధిదారులకు గుర్తించకుండా మేము బీసీలకు మైనార్టీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సీఎం, మంత్రులు అనడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్‌లో ఒక రూపాయి కేటాయించకుండా బీసీ, మైనార్టీ లబ్ధిదారులను గుర్తించకుండా ఏ విధంగా అభివృద్ధి చేసారని చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి ఎన్నికలలో అబద్ధపు హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో బీసీలు, మైనార్టీలు, మహిళలు, యువత వారికి ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. నేడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలు, మైనార్టీలను మోసగిస్తున్నారని విమర్శించారు.
సంక్షేమానికి బడ్జెట్‌లో
ఒకరూపాయి కేటాయించలేదు
రాష్ట్ర అధికార ప్రతినిధి
కొరముట్ల శ్రీనివాసులు