
బైకు అదుపుతప్పి యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని శాంతి నగర్ తిరుపతి బ్రిడ్జి వద్ద చియ్యవరం పంచాయతీ నడింపల్లికి చెందిన యువకుడు చరణ్ (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యువకుడు ద్విచక్రవాహనంలో వేగంగా వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్‌తో
వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె : కరెంట్ షాక్‌తో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం సత్యసాయి జిల్లా ఎన్.పి. కుంట మండలం బలిజ పల్లె పంచాయతీ సారగుండ్లపల్లెలో జరిగింది. స్థానికుడైన పెద్దరెడ్డప్ప కుమారుడు కృష్ణప్ప (40) తన పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా తీవ్రమైన గాలులు వీచాయి. దీంతో మోటార్‌కు అమర్చిన తీగలు తెగిపోవడంతో, వాటిని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎన్ పి కుంట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సోమవారం మెరుగైన వైద్యం కోసం మదనల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు.
పాఠశాల గుర్తింపు రద్దు
కడప ఎడ్యుకేషన్ : కమలాపురం పట్టణంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 నుంచి 10వ తరగతులకు సంబంధించిన గుర్తింపును రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. తల్లిదండ్రులు ఈ పాఠశాల నుంచి తమ పిల్లల ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ తీసుకొని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చేర్పించుకోవాలని సూచించారు.

బైకు అదుపుతప్పి యువకుడి మృతి