రేపే ‍గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు | April 2026 Planet Alignment: Some Signs Shine Others Tread Carefully | Sakshi
Sakshi News home page

రేపే ‍గ్రహకూటమి.. ఈ 5 రాశుల వారికి తిరుగులేదు

Apr 18 2026 9:41 AM | Updated on Apr 19 2026 7:44 AM

April 2026 Planet Alignment: Some Signs Shine Others Tread Carefully

ఆకాశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతోంది. నాలుగు గ్రహాలు బుధుడు(మెర్క్యురీ), అంగారకుడు(మార్స్‌), శని(శాటర్న్‌), నెప్ట్యూన్‌ గ్రహాలు ఒకే వరుసలో కనిపించబోతున్నాయి.  రేపు (సోమవారం) వేకువ ఝామున గ్రహ కూటమి(Planet Parade)లో ఈ ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. 

గ్రహ కూటమి ఏప్రిల్‌ 12వ తేదీ నుంచే ప్రారంభమైనప్పటికీ.. 21వ తేదీతో ముగియనుంది. చివరి ఐదు రోజులు స్పష్టంగా కనిపించే స్థాయి(విజిబిలిటీ) చేరుకుంది. అయితే.. వీక్షణకు మాత్రం ఏప్రిల్‌ 20వ తేదీ సరైందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయం 5-5.30గం. మధ్యలో మెర్క్యురీ, మార్స్‌, శాటర్న్‌ గ్రహాలు స్పష్టంగా అగుపించనున్నాయి. బైనాక్యులర్స్‌ లేదంటే టెలిస్కోప్‌ సాయంతో నెప్ట్యూన్‌ను చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో తూర్పు దిశలో స్పష్టంగా చూడొచ్చు. స్టార్‌వాక్‌-2( Star Walk 2), స్కై టునైట్‌(Sky Tonight) వంటి యాప్‌లు ఉపయోగించుకోవచ్చు.

ఏప్రిల్‌ 2026లో జరిగే ఈ నాలుగు గ్రహాల కూటమి శాస్త్రీయంగా దృశ్య విందు కలిగించే అరుదైన ఖగోళ సంఘటన. అయితే.. జ్యోతిష్యపరంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరం. 

తిరుగులేని ఐదు రాశులు
గ్రహ కూటమితో ఈ ఐదు రాశులవారికి తిరుగు ఉండదని.. పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆ రాశులను పరిశీలిస్తే.. 

మేషం: బుధుడి ప్రభావం వల్ల ఈ రాశివారిలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు.  ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. 

మిథునం: ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. పనికొచ్చే పరిచయాలు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వాహన యోగం ఉంది. 

వృశ్చికం: ఈ రాశివారిపై కుజుడి(అంగారక) ప్రభావం ఉంటుంది. కాస్త ధైర్యం ప్రదర్శిస్తే ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక లాభాలు చూస్తారు.  

మకరం: ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగవ్యాపారాల్లో లాభాలు ఉంటాయి.  నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. 

మీనం: ఈ రాశివారు ఆలయాలు సందర్శిస్తే మరీ మంచిది. కొత్త పనులు చేపడితే కచ్చితంగా విజయం సాధిస్తారు.

వార ఫలాలు ఏప్రిల్ 19 నుండి ఏప్రిల్ 25- 2026 వరకు

ఈ రాశివారికి జాగ్రత్తలు అవసరం.. 

వృషభం: శని ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కర్కాటకం: భావోద్వేగాలకు లోనవ్వకూడదు. బయట తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

తుల:  కుటుంబ సభ్యులతో కలహాలకు అవకాశం ఉంది. ఈ రాశివారికి నోరు జాగ్రత్తగా ఉండాలి

ధనుస్సు:  ఏ విషయంలోనూ గందరగోళానికి గురికాకూడదు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నష్టపోతారు. 


మిగతా రాశులవారికి ఇలా.. 

సింహం: ముఖ్యమైన పనులకు నాయకత్వం వహిస్తారు. కానీ ఆవేశపడకూడదు. 

కన్య: చదువు, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు దక్కవచ్చు. అయితే ఆచితూచి అడుగేయాలి.

కుంభం: సృజనాత్మకతకు పని చెప్తారు. కానీ, వాస్తవ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.

Advertisement
 
Advertisement
Advertisement