ఈ రాశి వారు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది | Daily Horoscope On 13th November 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది

Published Wed, Nov 13 2024 4:42 AM | Last Updated on Wed, Nov 13 2024 8:21 AM

Daily Horoscope On 13th November 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.10.02 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి రా.1.47 వరకు, తదుపరి అశ్వని,వర్జ్యం: ప.2.39 నుండి 4.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు, అమృతఘడియలు: రా.11.31 నుండి 1.01 వరకు, క్షీరాబ్ధి ద్వాదశి. 

సూర్యోదయం :    6.07
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు, దూరప్రయాణాలు. బంధువర్గంతో అకారణ వైరం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సమస్యలతో సాగుతాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

మిథునం: ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. ఆలోచన ముఖ్యం. కుటుంబసభ్యుల నుండి సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

తుల: చిత్రమైన సంఘటనలు.రుణబాధల నుండి విముక్తి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుండి కీలక సందేశం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన.వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుండి సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. 

మకరం: శుభవర్తమానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఏ పనీ ముందుకు సాగదు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువర్గంతో కలహాలు. వృత్తులు, వ్యాపారాలు ముందుకు సాగవు.

మీనం: కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు సమకూరతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement