శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.7.35 వరకు, తదుపరి చతుర్దశి తె.5.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: అశ్వని రా.12.03 వరకు తదుపరి భరణి, వర్జ్యం: రా.8.22 నుండి 9.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.12 వరకు, అమృతఘడియలు: సా.5.24 నుండి 6.55 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.07, సూర్యాస్తమయం: 5.21.
మేషం...ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. సోదరులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం....వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథనం....పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
కర్కాటకం...నూతన ఉద్యోగయోగం. పనులు చకచకా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.
సింహం....రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య....ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు సంభవం. .
తుల...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం..ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి ఉంటుంది.
ధనుస్సు....కొత్త రుణాలు చేస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యవహారాలలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
మకరం....మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆస్తి విషయంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం....కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. .
మీనం...వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment