మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.
వృషభం: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల పరిస్థితి.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం: కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు తీరతాయి. గృహ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
కన్య: ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తులు అన్నింటా సహకరిస్తారు. ఎంతటి వారినైనాఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
తుల: పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులుచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ధనుస్సు: ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు మందగిస్తాయి. విద్యార్థులకుఅంతగా అనుకూలించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
కుంభం: ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. విందువినోదాలు. సోదరుల నుంచి భూ, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
Comments
Please login to add a commentAdd a comment