ఈ రాశి వారికి అన్నింటా అనుకూలం.. గృహ, వాహనయోగం | Daily horoscope 16th november 2024 in telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి అన్నింటా అనుకూలం.. గృహ, వాహనయోగం

Published Sat, Nov 16 2024 5:09 AM | Last Updated on Sat, Nov 16 2024 7:05 AM

Daily horoscope 16th november 2024 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.పాడ్యమి రా.1.05 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: కృత్తిక రా.9.14 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ఉ.9.55 నుండి 11.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.56 నుండి 7.42 వరకు, అమృతఘడియలు: రా.7.02 నుండి 8.31 వరకు.; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 5.21.

మేషం: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఆరోగ్యభంగం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి.

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన. .

కర్కాటకం: శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. గృహ, వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. .

సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

ధనుస్సు: మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు. .

మకరం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. .

మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement