ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. | Today Telugu Horoscope On November 17th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు.

Published Sun, Nov 17 2024 4:17 AM | Last Updated on Sun, Nov 17 2024 9:56 AM

Daily horoscope 17th november 2024 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.విదియ రా.11.20 వరకు తదుపరి తదియ, నక్షత్రం: రోహిణి రా.8.08 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.31 నుండి 1.59 వరకు తదుపరి రా.1.35 నుండి 3.07 వరకు, దుర్ముహూర్తం: ప.3.55 నుండి 4.43 వరకు, అమృతఘడియలు: సా.5.10 నుండి 6.41 వరకు.

సూర్యోదయం        :  6.09
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

వృషభం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

ధనుస్సు: దన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మకరం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాMీ లు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత వేగంగా సాగుతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement