ఈ రాశి వారికి వ్యవహారాలు విజయం. శుభవార్తలు. సమాజంలో గౌరవం. | Daily Horoscope On 19th November 2024 in Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: వ్యవహారాలు విజయం. శుభవార్తలు. సమాజంలో గౌరవం.

Published Tue, Nov 19 2024 4:34 AM | Last Updated on Tue, Nov 19 2024 7:35 AM

Daily Horoscope On 19th November 2024 in Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చవితి రా.9.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఆరుద్ర రా.7.01 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.13 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.19 వరకు, అమృతఘడియలు: ఉ.9.13 నుండి 10.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.10, సూర్యాస్తమయం: 5.21. 

మేషం... వ్యవహారాలు విజయం. శుభవార్తలు. సమాజంలో గౌరవం.పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

వృషభం....పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

మిథునం....పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కర్కాటకం....కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

సింహం....ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య....కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తుల....అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

వృశ్చికం....శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు....శుభకార్యాల ప్రస్తావన. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం....ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కుంభం...మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

మీనం....ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement