శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పంచమి ఉ.7.32 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర ఉ.11.31 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.50 నుండి 9.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.32 నుండి 11.20 వరకు, అమృతఘడియలు: రా.1.20 నుండి 2.55 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 5.33.
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్నదిసాధిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
వృషభం: అనుకోని ధనవ్యయం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
మిథునం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయ దర్శనాలు.
సింహం: ఉద్యోగయత్నాలలో పురోగతి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపురాబడి. వ్యూహాలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. భూ, గృహయోగాలు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళపరిస్థితి.
వృశ్చికం: అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. అరుదైన సత్కారాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో
మీనం: వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి..
Comments
Please login to add a commentAdd a comment