శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం , తిథి: బ.నవమి రా.11.38 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పుబ్బ రా.12.20 వరకు, తదుపరి ఉత్తర,వర్జ్యం: ఉ.7.01 నుండి 8.45 వరకు, దుర్ముహూర్తం: ప.3.55 నుండి 4.43 వరకు, అమృతఘడియలు: సా.5.26 నుండి 7.32 వరకు.
సూర్యోదయం : 6.13
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం....చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం...ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. కావల్సిన వారితో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.
మిథునం...కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం....బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం.....ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బం«ధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..
కన్య.....పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
తుల...కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
వృశ్చికం....వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు...ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
మకరం....వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నిర్ణయాలలో పొరపాట్లు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
కుంభం....పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.
మీనం...నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment