గ్రహం-అనుగ్రహం: నేటి రాశులవారీగా ఫలితాలు ఇలా..
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,
సూర్యోదయం: 5.48, సూర్యాస్తమయం: 6.15.
తిథి: బ.ద్వాదశి తె.3.26 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి త్రయోదశి,
నక్షత్రం: పునర్వసు రా.8.21 వరకు, తదుపరి పుష్యమి,
వర్జ్యం: ఉ.8.10 నుండి 9.46 వరకు, తదుపరి తె.4.41 నుండి 6.17 వరకు (తెల్లవారితే శనివారం),
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.14 వరకు,
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,
అమృతఘడియలు: సా.5.57 నుండి 7.36 వరకు;
మేషం: పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
వృషభం: బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు కొద్దిపాటి ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటకం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాబడి తగ్గుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు.
సింహం: ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త ఆశలు.
కన్య: కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ మంచి పేరు గడిస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి..
తుల: పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు.
వృశ్చికం: ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. భూవివాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు తొందరపాటు తగదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
ధనుస్సు: ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మకరం: ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
కుంభం: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాల్లో మార్పులు. రాబడి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.
మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. ఇతరుల నుంచి విమర్శలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment