ఈ రాశివారికి పనుల్లో విజయం. అందరితో ఉత్సాహంగా గడుపుతారు | Today Telugu Horoscope On November 1st, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి పనుల్లో విజయం. అందరితో ఉత్సాహంగా గడుపుతారు

Published Fri, Nov 1 2024 7:21 AM | Last Updated on Fri, Nov 1 2024 8:36 AM

Daily Horoscope On November 01, 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చతుర్దశి ప.2.47 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: చిత్త రా.12.41 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.6.58 నుండి 8.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు, అమృతఘడియలు: సా.5.31 నుండి 7.16 వరకు, నరకచతుర్దశి, దీపావళి. 

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వస్తులాభాలు. వ్యవహారాలలో విజయం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల సలహాలు పొందుతారు. వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: పనుల్లో విజయం. అందరితో ఉత్సాహంగా గడుపుతారు. బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో పురోగతి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్చశ్చికం: రుణాలు చేస్తారు. ఆప్తులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు. విందువినోదాలు. కార్యజయం. వాహనసౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: నుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. మిత్రులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: శ్రమాధిక్యం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. రుణయత్నాలు. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement