శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: శు.నవమి సా.4.38 వరకు, తదుపరి దశమి,నక్షత్రం: దనిష్ఠ ఉ.7.46 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: ప.2.37 నుండి 4.05 వరకు, దుర్ముహూర్తం: సా.3.56 నుండి 4.44 వరకు, అమృతఘడియలు: రా.10.44 నుండి 12.10 వరకు.
సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం : 5.23
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తు,వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.
తుల: మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు..దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.
వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. వాహనయోగం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
Comments
Please login to add a commentAdd a comment