శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.షష్ఠి ఉ.6.32 వరకు తదుపరి సప్తమి తె.5.58 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం: ఆరుద్ర ఉ.11.16 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.11.23 నుండి 12.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు, అమృతఘడియలు: లేవు.
మేషం.... అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగిస్తారు. దైవదర్శనాలు.
వృషభం.... బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.
మిథునం... కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.
సింహం... కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.
కన్య.... ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.æ మిత్రుల కలయిక. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
తుల... కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం.. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కొన్ని పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. భూయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం.... ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.
కుంభం... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. అనారోగ్య సూచనలు.
మీనం.. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment