ఈ రాశివారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం! | Today Telugu Horoscope On October 24th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం!

Published Thu, Oct 24 2024 6:41 AM | Last Updated on Thu, Oct 24 2024 9:01 AM

daily horoscope october 24 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.అష్టమి తె.5.57 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి నవమి, నక్షత్రం: పునర్వసు ఉ.11.27 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.7.42 నుండి 9.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.16 వరకు, అమృతఘడియలు: ఉ.9.01 నుండి 10.34 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.59, సూర్యాస్తమయం: 5.31. 

మేషం... వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో చికాకులు.

వృషభం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

మిథునం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం... కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

సింహం.... వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

కన్య.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.

తుల... నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృశ్చికం.... బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

ధనుస్సు..... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

మకరం... మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.

మీనం.... పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement