శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.పంచమి సా.4.14 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర తె.4.50 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.10.24 నుండి 12.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: రా.8.02 నుండి 9.43 వరకు, శ్రీ పంచమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10.
మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. అదనపు రాబడి. కొత్త పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారులకు మరింత వెసులుబాటు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి.
వృషభం: అప్పులు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. అనారోగ్యం. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.
మిథునం: చిన్ననాటలు మిత్రుల కలయిక. శుభవార్తా శ్రవణం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి. కళాకారులకు అవార్డులు.
కర్కాటకం: కృషి చేసినా ఫలితం కనిపించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల పర్యటనలు వాయిదా.
సింహం: వ్యాపారుల ప్రయత్నాలలో పురోగతి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. యత్నకార్యసిద్ధి. ఇంటిలో శుభకార్యాలు. నూతన పరిచయాలు. వాహన, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు. దైవదర్శనాలు.
కన్య: కుటుంబసమస్యలు తీరతాయి. కార్యక్రమాలలో విజయం. దూరపు బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారులకు అధిక మొత్తంలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
తుల: కొన్ని పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో తగాదాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. శ్రమ మరింత పెరుగుతుంది.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఉద్యోగులకు ఒత్తిళ్లు. విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మందగిస్తాయి.
ధనుస్సు: ధైర్యంతో ముందడుగు వేసి పనులు పూర్తి చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. విందువినోదాలు..
మకరం: పనుల్లో విజయం. విలువైన సమాచారం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు.
కుంభం: ఇంటాబయటా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం కొంత తగ్గి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలోఅదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలలో అవరోధాలు.
మీనం: ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment