Horoscope Today: ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు | Daily Horoscope: Rasi Phalalu On April 17, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు

Published Wed, Apr 17 2024 6:32 AM | Last Updated on Wed, Apr 17 2024 8:25 AM

Daily Horoscope: Rasi Phalalu On April 17 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి సా.5.27 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పుష్యమి ఉ.7.41 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.30 నుండి 11.14 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: లేవు, శ్రీరామనవమి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.11. 

మేషం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష రాణింపు.

మిథునం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి..

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మకరం: బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement