Rasi Phalalu: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Published Thu, Apr 4 2024 6:06 AM

Daily Horoscope: Rasi Phalalu On April 4rd 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.దశమి ప.12.02 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: శ్రవణం సా.4.31 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.18 నుండి 9.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.00 నుండి 10.48 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: ఉ.6.34 నుండి 8.07 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 6.10. 

మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: పనులు ముందుకు సాగవు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకం: శుభవార్తలు అందుతాయి. విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలం.

సింహం: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. భూ ఒప్పందాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

తుల: రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల ప్రస్తావన. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం

మకరం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Advertisement
Advertisement