
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. తిథి: శు.నవమి రా.2.16 వరకు, తదుపరి దశమి. నక్షత్రం: ఆరుద్ర రా.9.45 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం: లేదు. దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.45 వరకు. అమృత ఘడియలు: ఉ.11.34 నుండి 12.46 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 6.11; సూర్యాస్తమయం: 6.06
మేషం: కార్యజయం. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు తీరతాయి. బంధువులతో సత్సంబంధాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. బా«ధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మిథునం: చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
కర్కాటకం: ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. మానసిక ఆందోళన. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రుణబాధల నుండి విముక్తి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు.
తుల: బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం కొంత ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
వృశ్చికం: కుటుంబసభ్యులతో ఒకింత అసహనానికి గురవుతారు. ఆర్థిక భారాలు తప్పవు. ప్రయాణాలు రద్దు కాగలవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల నుండి ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
కుంభం: వ్యవహారాలలో చికాకులు. మీ కష్టం కొన్నింటి వృథా కాగలదు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: కుటుంబంలో సమస్యలు. మిత్రులతో కలహాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
Comments
Please login to add a commentAdd a comment