
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.తదియ రా.12.35 వరకు తదుపరి చవితి, నక్షత్రం రోహిణి రా.12.54 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం సా.4.12 నుంచి 5.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.04 వరకు, తదుపరి రా.10.29 నుంచి 11.20 వరకు, అమృతఘడియలు... రా.9.24 నుంచి 11.10 వరకు.
సూర్యోదయం : 6.03
సూర్యాస్తమయం : 5.26
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
మేషం: కొత్తగా చేపట్టిన పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయులతో చర్చలు. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం: మిత్రులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
కర్కాటకం: అనుకోని పరిచయాలు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
సింహం: పలుకుబడి పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.
కన్య: రుణభారాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
తుల: లేనిపోని వివాదాలు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధన, ఆస్తి లాభాలు. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
ధనుస్సు: కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తుల కొనుగోలు యత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థులకు నిరాశ. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా కొనసాగుతాయి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.
Comments
Please login to add a commentAdd a comment