Today Horoscope: ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి, సంఘంలో గౌరవం | Today Rasi Phalalu: March 06, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి, సంఘంలో గౌరవం

Published Wed, Mar 6 2024 7:01 AM | Last Updated on Wed, Mar 6 2024 8:20 AM

Today Rasi Phalalu 06-03-2024 Today Horoscope  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ఏకాదశి రా.12.13 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.47 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.6.29 నుండి 8.01 వరకు, దుర్ముహూర్తం: ప.11.48 నుండి 12.36 వరకు, అమృత ఘడియలు: ఉ.6.08 నుండి 7.42 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.20, సూర్యాస్తమయం: 6.03. 

మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు  అధికం. ఇతరుల నుంచి విమర్శలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు.

మిథునం: ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త ఆశలు.

కర్కాటకం: పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

సింహం: ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. భూవివాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు తొందరపాటు తగదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాల్లో మార్పులు. రాబడి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.

తుల: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు కీలక సమాచారం.

మకరం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాబడి తగ్గుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు.

కుంభం: ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement